“తుఫాన్” రాకముందే సునామి హెచ్చరికలు...!!

K Prakesh
హీరో రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ తెలుగు వర్షన్ విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రగిలి పోతున్న సీమాంద్ర ఉద్యమ నేపధ్యంలో ఈ సినిమా పరిస్థితి పై సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది. రాజకీయాలకు ఈ సినిమా బలి అయిపోతుందా అనే మాట సీమాంద్ర అంతటా వినిపిస్తోంది. విజయనగరం, ఏలూరు మరియు సీమాంద్రకు సంబంధించిన అన్ని పట్టణాలలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ పోస్టర్లను కటౌట్ లను కాల్చివేసిన వార్తలు అటు చెర్రీకి, ఇటు చిరంజీవికి తెగ టెన్షన్ తెప్పిస్తున్నాయి.

అంతేకాకుండా సీమాంద్ర లోని ప్రముఖ సెంటర్ గా పేరుగాంచిన ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని దియేటర్లను సీమాంద్ర ఉద్యమ కారులు గత రెండు రోజులుగా చిరంజీవి రాజీనామాను డిమాండ్ చేస్తూ దియేటర్లలో సినిమాలను ఆడనీయకుండా చేస్తున్నారు. సీమాంద్ర ప్రాంతంలోని ఏ ధియేటర్ల ముందు ఈసినిమాకు సంబంధించి పోస్టర్లను, కటౌట్లును పెట్టనీయకుండ ఉద్యమకారులు అడ్డు కుంటున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థుతులు ఇలా ఉంటే చిరంజీవి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ చిరంజీవి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల జెఎసి ‘తుఫాన్’ సినిమాను తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సినిమాకు సమస్యలు సృష్టించే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా రాష్ట్రంలో దాదాపు 1000 ధియేటర్లలో విడుదల అవుతున్నా రాష్ట్రంలోని ఏ ధియేటరు యజమాని మొహంలోను ఆనందం కనిపించడం లేదనీ ఎక్కడ ఏమి జరుగుతుందో అనే భయంతో అటు ధియేటరు యజమానులు ఇటు మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారని రాష్ట్రంలో ఈ సినిమా విడుదల వాతావరణం కనిపించ కుండా తుఫాన్ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. ఈ సినిమాకు వచ్చే స్పందన బట్టి మాత్రమే మిగతా పెద్ద హీరోల సినిమాలు వస్తాయి కాబట్టి రేపు ఏమి జరుగుతుంది అనే ఆత్రుతతో టాలీవుడ్ పరిశ్రమ ‘తుఫాన్’ సినిమా రిజల్ట్ గురించి ఆత్రంగా వేచి చూస్తోంది అంటూ వినపడుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: