హోంవర్క్ చేసానంటున్న ప్రియమణి

Prasad
అందాలమణి ప్రియమణి నటిస్తోన్న తాజా సినిమా చారులత. ఈ చారులత చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలల పాత్ర చేస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ ఇది థాయ్ సినిమా స్ఫూర్తి అయినా షూటింగ్ కు వెళ్ళేముందు ప్రతిరోజూ చాలా హోంవర్క్ చేసానని చెప్పింది. కవలలు చూడటానికి ఒకేలా ఉంటారు. కాని పూర్తి విభిన్న క్యారెక్టర్లు. ఒకరు టామ్ బాయ్, ఇంకొకరు ఒద్దికగా ఉండే అమ్మాయి. నేను రెండు పాత్రల్లోనూ జీవించాలి. అందుకు నేను చాలా కష్టపడ్డాను అని చెప్పింది ప్రియమణి.  తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యే ఈ సినిమాపై ప్రియమణి చాలా ఆశలు పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: