ప్రభాస్ తో ఆనాటి గొడవ విషయాలను బయటపెట్టిన కంగనా రనౌత్ !

Seetha Sailaja
బాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోయిన్స్ ఉన్నా కంగనా రనౌత్ స్థాయి మాత్రం విభిన్నం.  జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు అందుకున్న ఈ బాలీవుడ్ బ్యూటి ఎంతటి గొప్ప వ్యక్తులను అయినా లెక్కచేయదు. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ నుండి లేటెస్ట్ గా డైరెక్టర్ క్రిష్ వరకు ఎందరితోనో ఈమెకు తీవ్ర వివాదాలు ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. చాల సంవత్సరాల క్రితం ప్రభాస్ తో కలిసి ఈమె ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక విషయంలో తనకు ప్రభాస్ పై తీవ్ర కోపం వచ్చి అప్పటి నుండి ప్రభాస్ తో మాట్లాడటం మానివేసిన విషయాన్ని తెలియచేసింది. 

అయితే ప్రభాస్ తో తనకు ఏవిషయం పై భేదాభిపరాయాలు వచ్చాయో ఆవిషయాలను మాత్రం చెప్పకుండా ఇప్పటికీ తనకు ప్రభాస్ కు మధ్య కనీసం మాటలు కూడ లేవు అన్న విషయాన్ని తెలియచేసింది. ప్రభాస్ ను నేషనల్ సెలెబ్రెటీగా మార్చిన ‘బాహుబలి’ మూవీ తాను చూశానని అంటూ తాను కూడ జాతీయ అవార్డులు తీసుకనే స్థాయికి ఎదిగిన విషయం బహుశా ప్రభాస్ కి కూడ తెలిసే ఉంటుంది అంటూ చురకలు అంటించింది. 

ప్రస్తుతం కంగన రనౌత్ సుమారు 300 కోట్లతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితానికి సంబంధించిన ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తోంది. ఈసినిమా విషయంలో దర్శకుడు క్రిష్ తో భేదాభిప్రాయాలు రావడంతో ఏకంగా క్రిష్ ను తొలగించి ఈసినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఆమె డైరెక్ట్ చేసింది అంటే ఆమె ధైర్యం ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. అయితే తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈసినిమా విషయంలో కంగనా క్రిష్ ల మధ్య రాజీ కుదిరింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో తిరిగి ప్రభాస్ కంగనాలు మళ్ళీ కలిసిపోయే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: