తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి భారత దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు రజినీ చేసే చిత విచిత్రమైన విన్యాసాల కోసమే సినిమాలకు వెళ్లేవారంటే అతిశయోక్తి లేదు. రజినీకాంత్ సిగరేట్, బీడీ ఏదైనా గాల్లోకి ఎగరేసి..నోట్లో వేసుకునే స్టైల్ ఇప్పటికే మర్చిపోలేరు. తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డ రజినీకాంత్ ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో సోషల్ మెసేజ్ తో కూడుకున్నవి కావడం విశేషం.
అర్జున్ తో తీసిన జెంటిల్ మాన్ మొదలు ఆ మద్య విక్రమ్ తో తీసిన ‘ఐ’ వరకు ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూస్తూ వచ్చాడు. ఇక రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచివే..రోబో, శివాజీ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ 2.0 మూవీ రోబోతున్న విషయం తెలిసిందే. రజినీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 మూవీ విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం సీజీ వర్క్స్ జరుపుకుంటోంది.
ఊహకందని గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూపించనున్నారనే టాక్ రావటంతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రోమో, టీజర్లను రూపొందించారు. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో తాజాగా ఈ సినిమాలోని లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్స్‌లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. ఇంతటి అవుట్‌పుట్ రావటానికి చిత్ర యూనిట్ ఏ రేంజ్ లో కష్టపడి ఉంటుందో అర్థమవుతోంది.
ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి. తమిళ్లో విడుదలైన ఈ సాంగ్‌కి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బాణీలు అందించగా.. మదన్ కర్కే లిరిక్స్ అందించారు. సిద్ శ్రీరామ్, షషా త్రిపాఠి ఆలపించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. రూ. 543 కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రేక్షకులముందుకు రానుంది.