టాలీవుడ్ కామెడీ హీరో సుడిగాడు అల్లరి నరేష్ కు పెళ్లి కుదరలేదు కదా అప్పుడే పెళ్లి కబుర్లు ఏమిటి అనుకోకండి. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అల్లరి నరేష్ మసను పెళ్లిపై మళ్లిందని అతడి కుటుంబానికి చెందిన సన్నిహితులు చెపుతున్నారు. గత రెండు సంవత్సరాలలో టాలీవుడ్ యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఅర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపి చంద్ లు పెళ్లి కొడుకు లై చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే ఇంక యంగ్ హీరోలలో ప్రభాస్, అల్లరి నరేష్ లు మాత్రమే పెళ్ళికి మిగిలి ఉన్నారు.
ప్రభాస్ కు బాహుబలి అడ్డం కాబట్టి ఇప్పట్లో కళ్యాణ యోగం లేదు. కాని ఇటువంటి సమస్యలు ఏవీ మన సుడిగాడికి లేవు. అందువల్ల అల్లరి నరేష్ సీరియస్ గా తనకు కాబోయే భార్య గురించి వెతుకుంటున్నాడట. కాని సినిమా తెరపై తెగ అల్లరి చేసే నరేష్ కు మాత్రం నిజ జీవితంలో చాలా సాంప్రదాయ బద్ధమైన భార్య కావాలి అని అంటున్నాడట. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లిని, తన కుటుంబాన్ని బాగా చూసుకొనే అమ్మాయి కావాలి అంటూ పలుచోట్ల వెతుకుతున్నాడట మన అల్లరోడు. అల్లరి నరేష్ కోరుకొనే లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం నరేష్ కుటుంబానికి ఆత్మీయుడు, ప్రముఖ నటుడు చలపతి రావు అలాగే మరికొంతమంది నరేష్ కుటుంబానికి చెందిన బంధువులు, హితులు మన సుడిగాడికి అమ్మాయి ని వెతికే పనిలో బిజీగా ఉన్నారట.
అన్నీ కుదిరితే ఈ సంవత్సరంలోపు లేదంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అల్లరి నరేష్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సంవత్సరం విడుదల అయిన యాక్షన్-3డి అల్లరి నరేష్ కు చేదు అనుభవం మిగిల్చినా తన కొత్త సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ ప్రస్తుతం తనకు కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన రవిబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ కామెడీ సినిమాలో వెరైటీగా కనిపించబోతున్నాడు నరేష్. మరొక ముఖ్య విషయ ఏమిటంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ మేకప్ కోసం లండన్ నుంచి వచ్చిన మేకప్ నిపుణుల నేతృత్వంలో మన అల్లరోడి కొత్త గెటప్ ఉంటుందట. మరి ఈ సినిమా అయినా నరేష్ కు హిట్ ఇస్తుంది అని అనుకోవాలి.