భయపెట్టే లుక్ తో చియాన్ విక్రమ్!

siri Madhukar

ఇండియన్ సినీ హిస్టరీలో విశ్వనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ నిర్మాణంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్   విడుదల చేశారు. కమల్ హాసన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది.  వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవ‌ల సామి 2 అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విక్ర‌మ్ ప్ర‌స్తుతం త‌న 56వ సినిమా లో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి ‘కాధారం కొండాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.


ఇందులో అత‌ని చేతులు సంకెళ్ళ‌తో బంధించి ఉండ‌గా, నోటిలో నుండి పొగ‌లు విర‌జిమ్ముతున్నాయి. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.   ఈ సినిమా రాజేష్ ఎం సెల్వ దర్శత్వంలో తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.  కమల్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించే జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.


తమిళనాట కమల్ తర్వాత ఆ తరహాలో ప్రయోగాత్మక సినిమాల్లో నటించింది విక్రమ్ అనే చెప్పొచ్చు.  రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నాడు. ఈ మూవీలో సౌంద‌ర్య రవీంద్ర‌న్, అక్ష‌ర హాస‌న్ ముఖ్య పాత్రలు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: