తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇళయదళపతి విజయ్ అంటే ఎంతో అభిమానించేవారు ఉన్నారు..ఇక్కడే కాదు కేరళాలో కూడా విజయ్ అంటే అభిమానించే ఫ్యాన్ చాలా మంది ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం రిలీజ్ సందర్భంగా అభిమానులు 50 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం దీనికి పాలాభిషేకం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంత పెద్ద కటౌట్ కట్టి అభిమానం చాటుకోవడం ఇదే మొదటి సారి అని ఆ కటౌట్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా నటుడు విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలిపోయింది. కాకపోతే ఆ కటౌట్ కూలిన ప్రమాదంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాకపోతే కటౌట్ కూలిన ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అత్తింగళ్లోని గంగ థియేటర్లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. అభిమాన సంఘంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సమస్యను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.