ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !

Seetha Sailaja
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాల పై తన స్పందన తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా ఈమధ్య విడుదలైన మణిరత్నం ‘నవాబ్’ విజయ్ ‘సర్కార్’ మూవీల పై మహేష్ కురిపించిన ప్రశంసలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. 

ఇంత యాక్టివ్ గా ఉండే మహేష్ తనకు ఎంతో సన్నిహితులైన జూనియర్ త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ గురించి ఒక్క మాట కూడ మాట్లాడ లేదు. ఈవిషయమై మహేష్ పై జూనియర్ అభిమానులు సోషల్ మీడియాలో మాటల దాడి చేసినా ఆవిషయాలను మహేష్ పట్టించుకోలేదు. 

ఇది చాలదు అన్నట్లుగా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవం గురించి ఇండస్ట్రీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలియచేసినా ఆవిషయాలను పట్టించుకోకుండా మహేష్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవ సందర్భంగా కనీసం తన అభినందనలు కూడ తెలియచేయలేదు. వాస్తవానికి రాజమౌళి మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో కొనసాగుతూనే ఉన్నా మహేష్ రాజమౌళి కూడ మరిచిపోవడం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది.

దీనికితోడు మహేష్ చరణ్ జూనియర్ లతో చాల మంచి స్నేహం ఉండటంతో వీరంతా కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఇన్ని కారణాలు ఉన్నా మరిన్ని సంబంధాలు ఉన్నా మహేష్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం గురించి కనీసం ఒక ట్విట్ కూడ చేయకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది అంతా మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ సినిమా బిజీ వల్ల అనుకోవాలా లేదంటే దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: