నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయమై బాలకృష్ణ తన మనసులో మాట తన సన్నిహితుల వద్ద కూడ బయటపెట్టడం లేదని సమాచారం. వాస్తవానికి మోక్షజ్ఞ ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడా లేక విదేశాలలో ఉన్నాడా అన్న విషయం పై కూడ పూర్తి సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇప్పటికే బాలకృష్ణ మోక్షజ్ఞకు సరిగ్గా ఎంట్రీ ఇవ్వగల దర్శకుల పేర్లు పరిశీలిస్తున్న నేపధ్యంలో ఆ లిస్టులో బోయపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే బాలయ్య తన కొడుకు మొదటి సినిమాను పూర్తి మాస్ గా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే హీరోగా చూపించగల దర్శకుడు కోసం అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థుతులలో ఈ మధ్య పూరి జగన్నాథ్ బాలయ్యను కలిసి మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకుని తాను క్రియేట్ చేసిన ఒక పవర్ ఫుల్ స్టోరీని వినిపించినట్లు సమాచారం. ఈ కథ బాలయ్యకు నచ్చినా తన నిర్ణయం బయటకు చెప్పకుండా బాలయ్య పూరీని పెండింగ్ లో పెట్టినట్లు టాక్. ఈవిషయమై పూర్తిగా బాలయ్య నుండి ఆశించిన సమాధానం పూరీకి రాకపోవడంతో రామ్ ను ఒప్పించి ఒక పవర్ ఫుల్ స్టోరీ రామ్ తో తీసే ఆలోచన కూడ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికోసమే రామ్ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని క్రికెటర్ విరాట్ కోహ్లీ లుక్ లో మారినట్లు టాక్. దీనితో కుదిరితే మోక్షజ్ఞ కుదరకుంటే రామ్ లను టార్గెట్ చేస్తూ పూరి జగన్నాథ్ తన రెండు పడవల సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ తిరిగి ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..