శర్వానంద్ ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో పడి పడి లేచే మనసు చిత్రంతో రాబోతున్న శర్వానంద్ మరో వైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సంక్రాంతికి సినిమాను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం చిత్ర విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ చిత్రం విడుదల విషయం పక్కన పెడితే టైటిల్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రంకు నాయకుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. రజినీకాంత్, మణిరత్నంలో కాంబినేషన్లో వచ్చిన దళపతి చిత్రం టైటిల్‌పై ప్రస్తుతం శర్వానంద్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
దళపతి అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్. మరి ఆ టైటిల్‌కు న్యాయం చేయగలరా అనేది చర్చనీయాంశం అవుతోంది. రజినీకాంత్, మమ్ముటీలు హీరోలుగా నటించిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. తమ చిత్ర కథకు దళపతి అయితే బాగుంటుందని దర్శకుడు సుధీర్‌బాబు అనుకుంటున్నాడట.
శర్వానంద్ గత కొంత కాలంగా సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది శతమానంభవతి చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. దాంతో శర్వానంద్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు అయినా సక్సెస్ అందుకుంటాయా అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.