‘సర్వం తాలమయం’ఫస్ట్ లుక్ విడుదల!

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రాజీవ్ మీనన్ చిత్రాలంటే ఎంతో ప్రత్యేకత ఉంటుంది.  ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలు దాదాపు అన్ని హిట్ టాక్ తెచ్చుకున్నవే.  ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా చాటిన జీవీ ప్రకాశ్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.  తాజాగా రాజీవ్ మీనన్, జీవి ప్రకాశ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సర్వం తాలమయం’.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్‌లో, చేతిలో మృదంగంతో  కనిపిస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు.  ఈ చిత్రంలో జీవి ప్రకాశ్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ తమిళ టైటిల్ తోనే  విడుదల అవుతుండడం విశేషం.  మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత ఈ సినిమాను నిర్మిస్తుండగా..  డిసెంబర్ 28 న చిత్రం విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: