ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!

siri Madhukar
ఆ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ విచిత్ర సోదరులు సినిమాలొ అప్పు పాత్రలో మరుగుజ్జువాడిగా నటించారు.  ఆ సినిమా ఆయన కెరీర్ పీక్ స్టేజ్ కి తీసుకు వెళ్లింది.  అప్పటి నుంచి ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ వచ్చారు.  సినిమా తెరపై ఆ తరహా ప్రయోగాలు ఎవరూ చేయలేక పోయారు.  మరుగుజ్జు పాత్రలో నటించడం అనేది సాహసపూరితమైన విషయమే. అలాంటి పాత్రలో చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ‘జిరో’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాలు పుల్ లెన్త్ మరుగుజ్జు పాత్రలో నటించాడు.  త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 

ఈ మద్య టివిల్లో డ్యాన్స్ కాంపిటీషన్ కి సంబంధించిన ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ డ్యాన్స్ కాంపిటీషన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబోడుస్తాయి.  తెలుగు లో సైతం ఈ మద్య డ్యాన్స్ రియాల్టీ షోలు బాగా అలరిస్తున్నాయి.   ఈ మద్య బాలీవుడ్ లో వారసులతో పాటు వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేష్ భట్ కూతురు ఆలియా భట్ హీరోయిన్ గా ఎంట్రీ మంచి విజయాలతో దూసుకు పోతుంది.  నటి అలియాభట్ తన డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేసింది.

కిడ్స్ ఛాయిస్ అవార్డ్సు 2017 కార్యక్రమంలో అలియా తమ్మా తమ్మా పాటకు స్టెప్పులేసింది. మేక్‌స్విప్ట్ లెగ్స్, పిల్లల కాస్ట్యూమ్స్‌తో చేతులను కాళ్లలా మార్చి తమ్మా తమ్మా పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, దర్శకకులు రోహిత్ శెట్టి ఆలియా భట్ ప్రదర్శన చూసి మంత్ర ముగ్దులు అయ్యారు.  రణ్ వీర్ సింగ్ అయితే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ..ఆలియాను మెచ్చుకున్నారు. స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, స్టేజి కిందున్న ప్రేక్షకులు అలియాభట్ ప్రదర్శనను కన్నార్పకుండా తిలకించారు. అలియా డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. 
Thought we were done with bizarre Bollywood stage performances till at least the new year. Then @deekshabhushan showed me this... pic.twitter.com/FKwB7L0CaZ

— Sahil Rizwan (@SahilRiz) December 12, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: