కలకలం రేపుతున్న చరణ్ పై వర్మ కామెంట్స్ !

Seetha Sailaja
రామ్ గోపాల్ వర్మ ఏమిచేసినా అది అత్యంత ఆశ్చర్యకరమే. అందుకే అతడు ఎవరి పై అయినా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల పై ప్రశంసలు కురిపించినా అందులో అర్ధాలు వెతికే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో వర్మ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ పై చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి.
 

రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నటించిన చిత్రం కావడంతో ‘వినయ విధేయ రామ’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్ననే ఈచిత్ర ఆడియో వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ లోని చరణ్ మాస్ లుక్ అందరికి బాగా కనెక్ట్ అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్ పై విభిన్నంగా స్పందించాడు. 

చరణ్ నటించిన ఈమూవీ ట్రైలర్ వావ్ అనిపించేలా ఉందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. అంతేకాదు ఈమూవీ ట్రైలర్ ను వర్మ తన ట్విటర్ లో షేర్ చేసి చరణ్ గోల్డ్ డైమండ్ అంటూ ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయాలిఅంటూ వర్మ కోరుతున్నాడు. ఇదే సందర్భంలో ఈసినిమాను ‘కెజిఫ్’ చిత్రంతో పోల్చుతూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

‘వినయ విధేయ రామ’ ట్రైలర్ గోల్డ్ లాంటి ‘కెజిఎఫ్’ చిత్రాన్ని డైమండ్స్ తో మిక్స్ చేసినట్లు ఉంది అంటూ ‘జంజీర్’ చిత్రాన్ని పక్కన పెడితే రామ్ చరణ్ కు ఈచిత్రం హిందీలో మెమరబుల్ మూవీ అవుతుందని వర్మ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నాడు. దీనితో వర్మ చరణ్ ను పోగుడుతున్నాడా లేదంటే వ్యూహాత్మకంగా సెటైర్లు వేస్తున్నాడా అన్న విషయం మెగా అభిమానులకు అర్ధంకాని విషయంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: