2018 : ఈ ముగ్గురి లో హీరో అఫ్ ది ఇయర్ ఎవరో తెలుసా ...!

Prathap Kaluva

2018 ఇయర్ టాలీవూడ్ కు ఎన్నో విజయాలు , అపజయాలు ను ఇచ్చింది . అయితే తెలుగు టాప్ హీరోస్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు బ్లాక్ బస్టర్స్ ను తమ ఖాతాలోకి వేసుకున్నారు . ఈ సంవత్సరం భారీ హిట్లు సాధించిన హీరోలు పలువురు వున్నారు కానీ 'హీరో ఆఫ్‌ ది ఇయర్‌' అనదగ్గ ఫీట్‌ చేసింది మాత్రం రామ్‌ చరణ్‌. 'రంగస్థలం'తో అతను కేవలం ఒక ఆషామాషీ విజయాన్ని మాత్రం అందుకోలేదు.


నటుడిగా తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్రని రామ్‌ చరణ్‌ ఇందులో పోషించాడు. మాస్‌ హీరో ఇమేజ్‌ని లెక్క చేయకుండా, వినికిడి లోపం వున్న చిట్టిబాబు పాత్రని చేయడానికి సాహసించాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తనకి నటన రాదని విమర్శించే వారికి ఛెళ్ళున సమాధానమిచ్చాడు. కేవలం నటుడిగా మెప్పించడమే కాకుండా 'నాన్‌ బాహుబలి' రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. దాదాపు నూట పాతిక కోట్ల షేర్‌ సాధించిన రంగస్థలం ప్రస్తుతం బాహుబలేతర సినిమాల్లో అగ్ర స్థానంలో వుంది. 


గతంలో మగధీరతోనే తన సత్తా చాటుకున్న చరణ్‌ మరోసారి ఒక టాలెంటెడ్‌ దర్శకుడి చేతిలో ఎలా పాత్రకి ప్రాణం పోయగలడనేది చూపించాడు. రంగస్థలం చరణ్‌ని తిరిగి అగ్ర స్థానానికి పోటీలో నిలబెట్టడమే కాకుండా మెగా వారసుడి విషయంలో నీరుగారిపోతోన్న అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది. కనుక ఈ ఏడాదికి చరణ్‌ టాప్‌ హీరోనే కాదు ఉత్తమ నటుడిగా అవార్డులు సయితం గెలుచుకోవడం తథ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: