ఉత్తరాయణ పుణ్యకాల విశిష్టత !

Seetha Sailaja
ప్రస్తుతం కొనసాగుతున్న ధనుర్మాసం శ్రీమహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈనెల అంతా వైష్ణవ ఆలయాలు చాల సందడిగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం - రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు అని అంటారు. 
సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం అంటే మారడం అనిభావం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్ళడం కోసం వెళ్ళిన రోజును ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.
ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్య క్షేత్రాలు తీర్ధ యాత్రలకు అనువుగా ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.

సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు దక్షిణం వైపు మరో ఆరు నెలలు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను మన పెద్దలు చెపుతూ ఉంటారు.  ఉత్తరాయణంలో దేవతలు మేలుకొని ఉంటారని అందువల్ల ఆకాలంలో మనం కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు అని నమ్మకం ఉంది. 

ముఖ్యంగా ఉత్తరాయణ కాలం నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలో పేర్కొనబడింది. వాస్తవానికి ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే ఈ పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈమకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని విశ్వాసం. ఇలా హిందువులకు పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణ పుణ్య కాలం గురించి ఎన్నో విషయాలు మన పురాణాలు చెపుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: