గత కొన్ని రోజులుగా సమంతకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ మీడియా లో హడావుడి చేస్తోంది. హాట్ సీన్స్ కు, స్కిన్ షో కు దూరంగా ఉండే సమంత ఇప్పుడు అటువంటి సీన్స్ తన సినిమాలలో ఉండాలని తాపత్రయ పడుతోంది అని వార్తలు రావడమే కాకుండా ఏకంగా సమంత ఒక సినిమాలో బికినీ తో తన విశ్వరూపాన్ని చూపెట్టబోతోందని హాట్ న్యూస్ హాట్ హాట్ గా వినిపిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు అయితే సమంత బికినీ విశ్వరూపం జూనియర్ తో నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్య’ లోనే ఉందని వార్తలు రాస్తూ ఉంటే, మరికొన్ని మీడియా వర్గాలు సమంత లేటెస్ట్ బికినీ అవతారం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో నటిస్తున్న ‘రభస’ సినిమాలో ఈ బికినీ రభస ఉంటుంది అని వార్తలు రాస్తున్నాయి.
అయితే ఈ వార్తలు వింటున్న విశ్లేషకులు మాత్రం సమంత తన కెరియర్ లో ఇలా బికినీ సీన్స్ లో నటించడం ద్వారా చాలా పెద్ద తప్పు చేస్తోందని, సామాన్యంగా సినిమాలలో క్రేజ్ తగ్గిపోయిన తరువాత తమకు దూరం అయిపోయిన క్రేజ్ ను తిరిగి పొందడానికి ఇటువంటి ప్రయత్నాలు హీరోయిన్స్ చేస్తూ ఉంటారని, ఉదాహరణగా గతంలో పెద్దగా అవకాశాలు రాని సందర్భాలలో ప్రియమణి, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ ఇటువంటి ప్రయోగాలు చేశారని, ఈ బికినీ ప్రయోగాల తరువాత చాలామంది టాప్ హీరోయిన్స్ కనుమరుగు అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటూ సమంత ఒప్పుకుంటే చాలు కోట్లు గుమ్మరిస్తామని నిర్మాతలు ఆమె ఇంటిముందు క్యూ కడుతూ ఉంటే, సమంత కు ఇదేమి ఖర్మ అంటూ కామెంట్స్ విసరడమే కాకుండా సమంత కు కూడా చివరి రోజులు వచ్చేశాయని అంటున్నారు.