మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ రగడ చల్లారకుండానే పవన్ కళ్యాణ్ సీనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కడప జిల్లా జనసేన నాయకులతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
సీనియర్ ఎన్టీఆర్ గతంలో ఆయన జీవించి ఉన్నప్పుడు తన పేరుతో కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని కామెంట్స్ చేసారని అయితే అప్పటి ఎన్నికలలో సీనియర్ ఎన్టీఆర్ పరాజయం పాలైన విషయాలను గుర్తుకు చేసాడు పవన్. తనకు ధవళేస్వరంలో అయినా అనంతపురంలో అయినా లక్షలాది అభిమానులు తనకు వచ్చారని అయితే తన తలకు పొగరు ఎక్కించుకొననీ అంటూ నందమూరి రాజకీయ నాయకుల పొగరు పై పరోక్షంగా కామెంట్ చేసాడు పవన్.
ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ తనకు జనసైనకులు పడుతున్న బాధ తెలుసు అనీ కేవలం తన అభిమానులను తమ జనసేన కార్యకర్తలను నమ్మి తాను రాజకీయాలలోకి వచ్చాను అన్న విషయాన్ని క్లారిటీ ఇస్తున్నాడు. తన అభిమానులు కష్టపడితేనే తాను ముఖ్యమంత్రి కాగలనని లేకుంటే తాను ముఖ్యమంత్రిని కాలేను అంటూ తన అభిమానులను రాబోతున్న ఎన్నికలకు బాగా కష్టపడమని పిలుపును ఇచ్చాడు పవన్.
తాను అధికారం కోసం రాజకీయాలలోకి రాలేదనీ కేవలం ఈ వ్యవస్థ పై విసుకుతో ఈ వ్యవస్థను బాగు చేయాలని తాను రాజకీయాలలోకి వచ్చిన విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా సుమారు 24 సంవత్సరాల క్రితం చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ మాటల పై ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేవిషయం అదేవిధంగా నాగబాబు కొనసాగిస్తున్న బాలకృష్ణ టార్గెట్ కామెంట్స్ ఇవన్నీ చూస్తే వ్యూహాత్మకంగా నందమూరి ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి మెగా ఫ్యామిలీ చాల తెలివిగా ప్రవర్తిస్తోందా అనే సందేహాలు అందరికీ కలగడం సహజం..