అల్లు అర్జున త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ ప్రకటన వచ్చి 20 రోజులు గడిచిపోతోంది. ఈమూవీ స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉన్న నేపధ్యంలో ఈమూవీకి ఫిబ్రవరిలో ముహూర్తం పెట్టి 6నెలలలో షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదలచేయాలి అన్న బన్నీ ఆలోచనలకు మెగా కాంపౌండ్ అడ్డు తగులుతున్నట్లు సమాచారం.
దీనికి కారణం చిరంజీవి ‘సైరా’ అని అంటున్నారు. ఈమూవీ షూటింగ్ వేగంగా జరుగుతూ ఉన్నా ఈమూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా మెగా కాంపౌండ్ కు ఒక క్లారిటీ లేకపోవడమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ బన్నీల మూవీ ఆరు నెలలలో చిత్రీకరణ పూర్తి చేసుకున్నా దసరా విడుదల విషయాన్ని చివరి వరకు ప్రకటింప వద్దు అంటూ అల్లు అర్జున్ కు మెగా కాంపౌండ్ నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు టాక్.
దీనితో ఫిబ్రవరి 14న మొదలు కాబోతున్న ఈమూవీ లాంచింగ్ ఫంక్షన్ లో ఈమూవీ రిలీజ్ గురించి ఎటువంటి ప్రకటన చేయకూడదని అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ చిత్రీకరణ పూర్తి అయినా ఈమూవీ రిలీజ్ దసరాకు ఉంటుందా లేకుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఉంటుందా అన్న విషయం పై క్లారిటీ లేకుండానే ఈమూవీ షూటింగ్ కొనసాగే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
ఈమూవీకి సంబంధించి హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు అనుకున్నా బన్నీ కియారాల స్క్రీన్ రొమాంటిక్ కెమిస్ట్రీ అంతగా రక్తి కట్టదు అన్న భావనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. దీనితో అల్లు అర్జున్ పక్కన కీర్తి సురేశ్ ను హీరోయిన్ గా ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై ప్రస్తుతం త్రివిక్రమ్ ఆలోచనలు కొనసాగుతున్నట్లు టాక్..