పడకసుఖం ఇస్తావా అంటూ విసిగిస్తున్నారు : గాయని చిన్మయి

siri Madhukar
ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది నటి శ్రీరెడ్డి పెద్ద ఉద్యమం చేసిన విషయం తెలిసిందే.  ఆ సమయంలో శ్రీరెడ్డి ఉద్యమానికి మంచి మద్దతు ఇస్తున్న సమయంలో విషయం కాస్త పక్కదోవ పట్టడం..పవన్  కళ్యాన్ అతని కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడటంతో ఆమె ఉద్యమం కాస్త నీరుగారిపోయింది. ఇక హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ ’ఉద్యమం బాలీవుడ్ లో పెను సంచలనాలు సృష్టించింది.  బాలీవుడ్ నటీమణులు తనూ శ్రీదత్తా గతంలో తనపై సీనియర్ నటులు నానా పటేకర్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు చేసింది. 

ఆ వెంటనే పలువురు నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక దాడులు వెలుబుచ్చారు.  ఇక దక్షిణాదిన సింగర్ చిన్మయి ‘మీ టూ ’ ఉద్యమంపై గళం విప్పింది.  తనను ప్రముఖ రచరియి వైర ముత్తు లైంగికంగా వెధించాడని ఆరోపించింది.  అప్పటి నుంచి చిన్మయిని టార్గెట్ చేసుకొని పలువురు సినీ ప్రముఖులు విమర్శలకు దిగారు. తాజాగా సినీపరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టినందుకే తనకు అవకాశాలు రాకుండా చేశారని నేపథ్య గాయని, చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు అవమానాలు, హేళనలు ఎదురయ్యారని వాపోయారు. గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కరాలు, సన్మానాలు పొందుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదని..ఆమె చనిపోతే, హత్యకు గురయితేనే సమాజం సీరియస్ గా పట్టించుకుంటుందని ఆమె దుయ్యబట్టారు.  మీ టూ ఉద్యమం గురించి పోరాడినందుకు తాను సోషల్ మీడియా నుంచి అన్నిరకాల వేధింపులను ఎదుర్కొంటున్నానని వాపోయారు.

తనను దూర్భాషలాడుతూ ట్రోలింగ్ చేస్తున్నారనీ, ‘నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు’ అని పిచ్చిపిచ్చి సందేశాలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమ్మాయిలపైనే కాదు, చిన్నవయసు అబ్బాయిలపైనా అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.  తన భర్త రాహుల్ రవీంద్రన్ సాయం వల్లే తాను సినీ పరిశ్రమలో లైంగికవేధింపులపై ధైర్యంగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: