కె.జి.ఎఫ్ తెలుగు టోటల్ కలక్షన్స్.. కన్నడ హీరో చరిత్ర సృష్టించాడు..!

shami
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. కోలార్ బంగారు గనుల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా చాప్టర్ 1 కన్నడతో పాటుగా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కన్నడలో 50 కోట్ల వసూళ్లు తీసుకురావడమే ఓ పెద్ద రికార్డ్ అలాంటిది కె.జి.ఎఫ్ ఏకంగా 250 కోట్లను వసూళు చేసింది.


కన్నడ సిని చరిత్రలో కనివిని ఎరుగని రికార్డులను క్రియేట్ చేశాడు యశ్. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో 5 కోట్ల బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా 12 కోట్ల దాకా వసూళు చేసింది అంటే కె.జి.ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో కన్నడ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడం గొప్ప విషయం.


కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సక్సెస్ అంచనాలకు మించి ఉండటంతో చాప్టర్ 2ని మరింత భారీగా ఉండేలా చూస్తున్నారు మేకర్స్. కె.జి.ఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారని తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమా వసూళ్లు చూసి అందరు అవాక్కవుతున్నారు. ఏరియాల వారిగా కె.జి.ఎఫ్ చాప్టర్ 1 వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే.


నైజాం : 4.80 కోట్లు
సీడెడ్ : 2.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.45 కోట్లు
ఈస్ట్ : 0.72 కోట్లు
వెస్ట్ : 0.60 కోట్లు
కృష్ణా : 1.10 కోట్లు
గుంటూరు : 0.90 కోట్లు
నెల్లూరు : 0.30 కోట్లు  
తెలుగు రెండు రాష్ట్రాల్లో : 12.27 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: