ఆ ఐదుగురు ఆడాళ్ల వెనుక ఒక్క మగాడు!

siri Madhukar
టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని ‘భలే భలే మగాడివోయ్’సినిమా హిట్ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు.  చిన్న నిర్మాతల పాలిట కల్పతరువుగా మారిన నాని ఆ మద్య ప్రేమకథా  నేపథ్యంలో ఎక్కువగా వచ్చాడు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చి ప్రమోగాత్మక సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నాడు.  జర్సీ సినిమతో క్రికెట్ బ్యాగ్ డ్రాప్ లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు చిత్ర యూనిట్. 

ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో నాని ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ముహూర్తం కూడా ఖరారైంది.  తాజాగా నాని-విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించి చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో కూడా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.   ఈ సందర్భంగా నాని ‘ఆయన కళ్లద్దాలు, గెడ్డం, చేతిలో వెల్డింగ్‌ గన్ (‘గ్యాంగ్‌ లీడర్’‌లో చిరంజీవి లుక్‌ను ఉద్దేశిస్తూ)‌ నాకు ఇంకా గుర్తుంది. తొలిరోజు తొలి షోకు వెళ్లా. వీరాభిమానిగా గర్వంతో ఆయన టైటిల్‌ను ఇవాళ ప్రకటిస్తున్నా’ అని నాని ట్వీట్‌ చేశారు. 

ఇక వీడియోలో కమెడిన్ పోలీస్ కి వివరిస్తూ..చిన్న పాప సర్‌, కూతురు వయసు.. ఎనిమిదేళ్లు ఉంటాయి. ఒక టీనేజీ అమ్మాయి సర్,‌ చెల్లెలు వయసు.. 15 ఏళ్లు ఉంటాయి సర్‌. మూడో అమ్మాయికి 22 ఏళ్లు ఉంటాయి సర్, కత్తిలా ఉంటుంది..50 ఏళ్లు సార్ అమ్మ, చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది..మరో ఆవిడ ఓ ఎనభై ఏళ్లు ఉంటుంది..కాటికి కాలు చాచింది..దేవుడి కాల్ కోసం ఎదురు చూస్తుందని డైలాగ్ కొట్టి పోలీస్ వంక సీరియస్ గా చూస్తూ..ఈ ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌ వెనుక ఒక్కడు ఉన్నాడు సర్‌..  అంటూ ‘గ్యాంగ్‌ లీడర్’‌ టైటిల్‌ను రివీల్‌ చేశారు. ‘ఇంకెన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారు రా.. అసలు ఎప్పుడు బయటికి వస్తారు?’ అని పోలీసు కోపంగా అరుస్తుంటే నటుడు గట్టిగా నవ్వడం సరదాగా అనిపిస్తుంది.
Still remember the aviators and the beard look and the welding gun in his hands :)
First day first show as a kid and the rest was history
A proud fan announcing his title today #Nani24 title is here ...@Vikram_K_Kumar @anirudhofficial @MythriOfficial pic.twitter.com/ty5Tm0QpcU

— Nani (@NameisNani) February 24, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: