విజయ్ దేవరకొండ, సూర్య విషయంలో చేతులెత్తేసినట్లేనా..?

KSK
గత కొద్ది రోజుల నుండి విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా అలాగే మరియు సూర్య నటించిన  'ఎన్‌జీకే' సినిమా విడుదల విషయంలో తేదీల విషయంలో వివాదాస్పదమైన వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మరియు తమిళ సినిమా రంగంలోనూ తెగ వినబడుతున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్స్ సినిమా తెలుగు మరియు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా భారీగా విడుదల చేయాలని ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు.


ఈ సందర్భంగా మే 31వ తారీకున వేసవి సీజన్ ని టార్గెట్ చేసుకుని డేట్ ఫిక్స్ చేసేసుకున్నారు డియర్ కామ్రేడ్స్ సినిమా యూనిట్. ఇదిలా ఉండగా అదే సమయానికి సూర్య నటించిన 'ఎన్‌జీకే' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో 'డియర్ కామ్రేడ్' సినిమా యూనిట్ ఆలోచనలో పడింది. సూర్య సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు.


పైగా ఆయనకి తమిళంలో ఫాలోయింగ్  మాములుగా లేదు.ఈ క్రమంలో ఆయనకి పోటీగా విజయ్ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తోన్న యూనిట్ 'డియర్ కామ్రేడ్'ని వారం రోజులు ఆగి జూన్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో విజయ్ దేవరకొండ సీనియర్ హీరో అని సూర్య కి గౌరవం ఇచ్చి తన సినిమా విషయంలో వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: