కెరియర్ లో ఇప్పటి వరకు చేయని పాత్రను చేయబోతున్న మహేష్..?
ఈ నేపథ్యంలో మహర్షి సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మరికొద్ది రోజుల్లో వేసవి కానుకగా విడుదల కాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి రెడీ అయిన మహేష్ తన నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేయబోయే ప్రాజెక్టు కి కూడా అన్ని విధాల సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమాలో ఫస్ట్ టైమ్ మహేశ్ ఆర్మీ ఆఫీసర్గా స్టైల్లో కనిపించనున్నట్లు కథ కూడా అదే విధంగా సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. సుకుమార్ తో సినిమా కాదని మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో ప్రకటించి అనిల్ రావిపూడి తో చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందోనని మహేష్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు..మరోవైపు విడుదలకు సిద్ధంగా ఉన్న మహర్షి సినిమాపై కూడా అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.