తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగ చైతన్య. మొదటి చిత్రం జోష్ పెద్దగా హిట్ కాకపోయినా తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో తన సహ నటి సమంతతో రియల్ లైఫ్ లో లవ్ లో పడ్డాడు చైతూ. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆటో నగర్ సూర్య, మనం చిత్రాలు వచ్చాయి. ఈ జంట ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత చెప్పుకుంటున్నారు.
పైళ్లైన తర్వాత ఈ జంట మొదటిసారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథనాయికగా దివ్యాంష కౌశిక్ నటించింది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. తాజాగా చై, సామ్ ప్రమోషన్ లో భాగంగా గెస్ ది వర్డ్’ అనే ఫన్నీ ఆట ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
అయితే ఈ గేమ్ రూల్స్ ప్రకారం హై సౌండ్‌తో ఉండే హెడ్ ఫోన్స్ పెట్టుకొని అవతలి వారు చెప్పే పదాలని గెస్ చేయాలి. ముందుగా సమంత హెడ్ ఫోన్స్ పెట్టుకొని గేమ్ ఆడింది. రెండింటికి మాత్రమే సమాధానం చెప్పలేకపోయిన సామ్ మిగతావన్నింటిని గెస్ చేసి కరెక్ట్ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత చైతన్య కూడా కొన్నింటికి గెస్ చేసి సమాధానం చెప్పాడు. మొత్తానికి వీరి మద్య సాగిన ఈ గేమ్ ఫన్నీగా అభిమానులను ఆనందపరిచాయి. ఫన్నీ వీడియోలో చైతూ, సామ్‌ల సరదా సంభాషణలు అభిమానులకి కూడా నవ్వు తెప్పిస్తున్నాయి