‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ పేరు ఎరగని సినిమా అభిమానులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’ తో ప్రభాస్ మార్కెట్ 10 రెట్లకు పైగా పెరిగి పోవడంతో అతడి సినిమాలను అత్యంత భారీ రేట్లకు కొనడానికి బయ్యర్లు క్యూ కడుతున్నారు.
ఇలాంటి పరిస్తుతులలో ప్రభాస్ కు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినా అతడి ఫేస్ బుక్ పేజీకి కోటి మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.
‘actorprabhas’ అనే పేరుతో ఈ అకౌంట్ మొదలైంది. అయితే అది నిజంగా ప్రభాస్ దా ? కాదా అన్న విషయం పై క్లారిటీ లేదు. అందులో ప్రభాస్ ఫొటో లేదు. ఇంకే రకమైన పోస్టులు లేవు. ప్రొఫైల్ పిక్ ఖాళీగా ఉంది. కానీ ఇది ప్రభాస్ అకౌంటే అన్న గుడ్డి నమ్మకంతో కొన్ని గంటలలోనే ఆ ఎకౌంట్ కు 7 లక్షల మంది ఫాలోయర్స్ చేరిపోయారు.
అయితే ఇప్పటికే ప్రభాస్ పేరుతో చాలా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. లక్షల మంది నెటిజన్లు వాటిని వెరిఫై చేసుకోకుండా వాటిని ఫాలో అవుతున్నారు. ఈవిశాయాల పై స్పందించే ఉద్దేశ్యం కూడ ప్రభాస్ కు లేదు. దీనితో ప్రభాస్ మ్యానియా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా అసలు ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసాడా లేదా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..