మీరు చదువుతున్న వార్త మీరు నమ్మినా నమ్మకపోయినా నూటికి నూరుపాళ్ళు నిజం. బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న సంపుర్నేష్ బాబు కు ఆ టైటిల్ ఎవరిచ్చారో తెలియకపోయినా ప్రస్తుతం సంపుర్నేష్ ను బర్నింగ్ స్టార్ గానే గుర్తిస్తున్నారు. ‘హృదయ కాలేయం’ సినిమా స్టిల్స్ తో టీజర్ తో రికార్డు లు సృష్టించి రాజమౌళి లాంటి ప్రముఖ వ్యక్తుల ప్రశంశలు కూడా పొందిన వ్యక్తి సంపుర్నేష్.
లేటెస్ట్ గా ఇతడు నటిస్తున్న ‘హృదయ కాలేయం’ సినిమాకు జేమ్స్ కేమారున్ తో పనిచేసిన ఫోటో గ్రాఫర్ రసూల్ కార్పెంటర్ ను అలాగే మెక్సికో దేశానికి చెందిన స్టైలిస్ట్ డిజైనర్ అన్నా మరీనా సలహాలను కూడా ఈ హృదయ కాలేయం సినిమాకు తీసుకుంటున్నట్లు ఈ సినిమా ప్రొడక్షన్ యూనిట్ ప్రకటించడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. స్టీవెన్ శంకర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ హృదయ కాలేయం విడుదల కాకుండానే ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. సైంటిఫిక్ మాస్ లవ్ స్టొరీ గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల కాకుండానే సంపుర్నేష్ కు టాలీవుడ్ లో సెలబ్రిటీ స్టేటస్ కలగజేసింది.