బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ ఎంట్రీ కార్డుతో హఠాత్తుగా బిగ్ బాస్ హౌజ్ లో మెరుపులా మెరిసింది నటి పూజా రామచంద్రన్. హాట్ హాట్ డ్రెస్సులతో కుర్రాళ్లకు మత్తెక్కించేలా చేసింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ..బిగ్ బాస్ లో హుషారుగా కనిపించింది. కాకపోతే ఈ అమ్మడు మద్యలోనే ఎలిమినేట్ కావడంతో వెళ్లిపోయింది. అయితే బిగ్ బాస్ కన్నా ముందు పూజా, నిఖిల్ నటించిన ‘స్వామిరారా’ చిత్రంలో కనిపించింది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది పూజా.
తాజాగా పూజా రామచంద్రన్ తన రెండో పెళ్లితో అందరిని సర్ ప్రైజ్ చేసింది. కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్న నటుడు జాన్ కొక్కెన్ తో పూజా పెళ్లి జరిగింది. కేరళ సాంప్రదాయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎస్.ఎస్ మ్యూజిక్ యాంకర్ గా విజేగా కెరియర్ స్టార్ట్ చేసిన పూజా రామచంద్రన్ అతన్నితో ప్రేమలో పడటం పెళ్లి చేసుకున్నా..రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.
సోలోగా ఉంటూ వస్తున్న పూజా, జాన్ కొక్కెన్ తో స్నేహం చేసింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకొచ్చింది. విశేషం ఏంటంటే జాన్ కొక్కెన్ కు ఇది రెండో పెళ్లే. అయితే . జాన్ కొక్కెన్మీ, నా వాసుదేవన్ ను పెళ్లాడాడు అయితే వీరికి మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకోవడం మరో విశేషం.