తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం నాని, శ్రద్దా శ్రీనాధ్ నటించిన ఈ చిత్రం మొదటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చింది. ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ లో నాని నటన చూసి అప్పడే ఈ చిత్రం పై భారీ అంచనాలు పెంచుకున్నారు.
నేడు రిజీల్ అయిన అన్ని సెంటర్లలో మంచి టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రలో నాని మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఫస్టాఫ్ మంచి ప్రేమికుడిగా..తర్వాత గొప్ప ఆటగాడిగా..తండ్రిగా అన్ని రకాల పాత్రలో తనదైన విశ్వరూపం చూపించాడు నాని.
తాజాగా ఈ సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్ చేశారు. సినిమా చాలా బాగుందని, నాని సూపర్‌గా నటించడని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇక గౌతమ్ తిన్ననూరి అద్బుతమైన కథను తెలుగు ప్రేక్షకులకు అందిచాడని , చిత్ర యూనిట్‌కు కాంగ్రాట్స్ తెలిపాడు ఎన్టీఆర్.
#Jersey is an outstanding film that took me on a roller coaster ride. Hats off to Gautam Tinnanuri for choosing such a subject and executing it with conviction and brilliance. Kudos to the cast and crew who excelled and supported Gautam’s vision.— Jr NTR (@tarak9999) April 19, 2019