టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవల మంచి హిట్ సినిమాలు వరుసగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇటు అప్పుడప్పుడు పాలిటిక్స్‌పై కూడా ఓ కన్నేస్తుంటాడు. గత ఎన్నికల్లో తన బంధువు కోసం ప్రచారం కూడా చేసిన నిఖిల్ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో గెలుపు ఓటములపై తన అభిప్రాయం చెప్పాడు. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం మరో 24 రోజులు ఉత్కంఠతో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిపై స్పందించిన నిఖిల్ ఎవరు ? గెలుస్తారన్నది సూటిగా చెప్పకపోయినా మూడు ప్రధాన పార్టీలపై తన అభిప్రాయం చెప్పారు.
సీఎం చంద్రబాబు ఏపీకి ఎంతో చేశారు... ఆయనకు చాలా అనుభవం ఉందని... ఇక జగన్ లాంటి యంగ్ లీడర్ కూడా కావాలని.. ఆయన చాలా హార్డ్ వర్కర్... జగన్ కూడా ఏం చేస్తారో ? చూడాలని ఉందన్నారు. ఇక జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఆ యాత్ర సూపర్ సక్సెస్ అని.. ఆయన ఎప్పుడూ జనాల్లో ఉండడం చాలా గ్రేట్ అని తెలిపాడు.
ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తనకు చాలా ఇష్టమైన పవన్ కళ్యాణ్ సైతం ఏం ? చేస్తారో చూడాలని ఉందన్నాడు. ఓవరాల్‌గా ముగ్గురు పార్టీ నేతల గురించి మాట్లాడిన నిఖిల్ ఏ పార్టీకి ? ఎన్ని ? సీట్లు వస్తాయన్న విషయంపై సూటిగా మాట్లాడలేదు. పవన్‌కు మాత్రం 100 సీట్లు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. పవన్ నటించిన చాలా సినిమాలు 100 రోజులు ఆడాయని.. ఇప్పుడు పవన్ జనసేనకు కూడా అన్నే సీట్లు రావాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు.
ఫైనల్‌గా నిఖిల్ చాలా తెలివిగా చంద్రబాబు, జగన్, పవన్ గురించి చెప్పడంతో పాటు జనసేనకు 100 సీట్లు రావాలని కోరుకుని పవన్ సీఎం అవ్వాలని తన మనస్సులో మాట చెప్పేశాడు. మరి నిఖిల్ కోరిక తీరుతుందా ? లేదా ? అన్నది ఇప్పటికే తనకు కూడా ఓ క్లారిటీ ఉండి ఉంటుంది.