అంతర్జాతీయంగా తెలుగు సినిమా పాట మరోసారి మారుమ్రోగింది, ప్రపంచ వ్యాప్తంగా డాన్స్ షో అభిమానులకు "వరల్డ్ ఆఫ్ డ్యాన్స్" రియాల్టీ షో గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. డాన్స్ పోటీల్లోనే డిఫరెంట్ స్టైల్ లో ఉండే ఈ ప్రోగ్రాంలో భారత డ్యాన్స్ గ్రూప్ కి చెందిన "ది కింగ్స్" పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పాటకు డ్యాన్స్ చేశారు.
పవన్ నటించిన సినిమా "సర్దార్ గబ్బర్ సింగ్" లోని "వాడెవడన్నా.. వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా.." అనే పాటకు "ది కింగ్స్" అద్భుతంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను "వరల్డ్ ఆఫ్ డ్యాన్స్" తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఇదే షో లో ఖైదీ నంబర్ 150 లో "సన్నజాజిలా నవ్వేసిందిరో" పాటను ప్రదర్శించారు ఇప్పుడు పవర్ స్టార్ పాటను ప్రదర్శించడంతో మెగా ఫాన్స్ ఖుషి చేసుకుంటున్నారు.
ఇక ఈ విషయంపై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ నాపాటకు అంతర్జాతీయ డ్యాన్స్ స్టేజీపైన ప్రదర్శన ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు . నా సంగీతనికి ప్రజల్ని ఇంతలా డ్యాన్స్ చేయించడం చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ధన్యవాదాలు.. లవ్ యు గాయ్స్ కీప్ "రాకింగ్" అని ట్వీట్ చేశారు.