తన అభిమాని వింత కోరిక తీర్చిన రేష్మి..!
సదరు అభిమాని కోరుకున్నది ఏమిటంటే రేష్మి గారు గుడ్ మార్నింగ్. నాదో చిన్న కోరిక. ఈ రోజు నా బర్త్ డే. మీ నుంచి నేను విషెస్ కోరుకొంటున్నాను. మీరు నా పేరును పేర్కొంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపండి. మీరు విషెస్ తెలియజేయకుంటే జీవితంలో ఈ రోజుకు అర్ధం ఉండదు. నా బర్త్ డే అసంపూర్తిగానే గడచిపోతుంది. థ్యాంక్యూ మామ్ అంటూ మెసేజ్ పెట్టారు.
అభిమాని కోరికకు రష్మి స్పందించారు. కానీ అభిమాని పేరు చెప్పకుండా హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పారు. అభిమాని పేరుతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఉంటే బాగుండేదేమో అనే వాదన సోషల్ మీడియాలో వినిపించింది. కాని అభిమానికి రష్మి విషెస్ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.