అందరూ ఎదురు చూస్తోన్న కేజీఎఫ్ 2 మీద లేటెస్ట్ న్యూస్ అప్డేట్ !
ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వివరాలు చిత్రయూనిట్ తెలియజేసింది. బయటకు వచ్చిన వివరాలను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో సాగుతుండగా మరికొద్ది రోజుల్లో మైసూర్ లో ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు చివరాఖరుగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్లారిలో భారీ షెడ్యూల్ ఉండనున్నట్లు తెలియజేశారు.
అంతేకాకుండా ఇప్పటికే షూటింగ్ దాదాపు 80-90శాతం అప్పటికి పూర్తవుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ ని చూపించనున్నామని దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ ఇదివరకూ వెళ్లడించారు. అంతేకాకుండా రెండవ భాగంలో భారీ ఫైట్లు ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.