ఇలా అయితే పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ ?
ఇటువంటి క్రమంలో తనకు మాదిరే హిట్ కోసం వెయిట్ చేస్తున్నా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఔట్ అవుట్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ఇస్మార్ర్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల రాం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు సినిమా నిర్మాతలు. అయితే తాజాగా విడుదలైన ఇస్మార్ర్ట్ శంకర్ టీజర్ లో కొత్తదనం లేకపోవడం మరి హీరో రామ్ బాడీ లాంగ్వేజ్, లుక్ చాలా ఎఫెక్టివ్ గా ఉండకపోవటం తో సినిమాపై అప్పుడే సోషల్ మీడియాలో నెగటివ్ ఫీలింగ్ కలిగేటట్లు ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
సినిమా టీజర్ నీ చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇది పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా ఏనా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న పూరి జగన్నాథ్ అభిమానులు ఈ సినిమా టీజర్ చూడటంతో ఓపెనింగ్స్ రావడం కష్టమే అని...అసలే డౌన్ ఫాల్ లో ఉన్న పూరి ఇటువంటి టీజర్ ఇవ్వటం ఏమిటని ...అసలు టీజర్లో కొత్తదనం లేదని కామెంట్ చేస్తున్నారు .