'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
ఈ సినిమాలో నాని పక్కన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా లో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సీనియర్ లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, రఘు బాబు, ప్రియదర్శి, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ PC శ్రీరామ్ గ్యాంగ్ లీడర్ మూవీ కి వర్క్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్యాంగ్ లీడర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్లాక్ బస్టర్ మూవీ జెర్సీ తరువాత హీరో నాని నటించే గ్యాంగ్ లీడర్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.