బోయపాటి శీను.. ఈ పేరు చెబితే బాలయ్య తో చేసిన 'సింహ', 'లెజెండ్', బన్నీ తో చేసిన 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు టక్కున గుర్తొస్తాయి. అంతేకాదు ఈ మధ్య ఎన్నో అంచనాలతో బ్లాక్ బస్టర్ హిట్టవుతుందనుకున్న 'వినయ విధేయ రామ' తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి డిజాస్టర్ ఇచ్చాడని కుడా గుర్తొస్తుంది. 'రంగస్థలం' సినిమాతో రాం చరణ్ కి వచ్చిన ఇమేజ్ 'వినయ విధేయ రామ' తో డబుల్ అవుతుందనుకుంటే అంతా తారుమారయింది. అంతగా మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు బోయపాటి. ఆ ఇంపాక్ట్ వల్లే ఇప్పటి వరకు తన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు రాలేదు.
ఒక డైరెక్టర్ కి హిట్స్, ఫ్లాప్స్ కామన్. కానీ ఒక స్టార్ హీరోకి డిజాస్టర్‌ని ఇస్తే ఒక స్టార్ డైరెక్టర్ పరిస్థితి ఎలా వుంటుందో ఈ సినిమాతో బోయపాటికి అర్థమై ఉంటుందని ఇండస్ట్రీ టాక్.
ఎందుకంటే 'వినయ విధేయ రామ' కనీసం యావరేజ్ అయినా బోయపాటి శీను గ్రాఫ్ ఇంకోలా ఉండేదేమో. కాని మరీ దారుణమైన డిజాస్టర్ కావడంతో అతని మీద చాలా ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఎన్టీఆర్ ముందు వరకు సినిమా చేస్తానని మాట ఇచ్చిన బాలకృష్ణ, బోయపాటికి షాకిచ్చి.. కెఎస్ రవికుమార్ ని లైన్ లో పెట్టడం ఎవరూ ఊహించరు. దర్శకులకు హిట్టు ఫ్లాపు కామనే అయినప్పటికీ చేతి దాకా వచ్చిన ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో గెస్ చేయొచ్చు.
ప్రస్తుతం బోయపాటి శీను పరిస్థితి కూడా అదే. ఎవరైనా క్రేజీ హీరోతో ఓ మీడియం బడ్జెట్ మూవీ చేయాలన్న బోయపాటి ప్లాన్స్ రివర్స్ అవుతున్నాయి. 'R.X.100'ఫేం కార్తికేయతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికి కార్తికేయ నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ. ఇక బోయపాటికి డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక అఖిల్ తో ట్రై చేద్దామంటే ప్రస్తుతం అఖిల్ బోయపాటితో అంత రిస్క్ చేయలేడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బోయపాటి చేతిలో కనీసం ఒక్క సినిమా అయినా ఉంటే బావుండును. డెఫినేట్‌గా కం బ్యాక్ అవుతాడు.