‘సాహో’ డిజాస్టర్ అంట!

siri Madhukar

అలూ లేదూ..చూలూ లేదు..అదేదో అన్నట్టుంది ఓ బాలీవుడ్ నటుడి తీరు.  గతంలో తన కాంట్రవర్సీ మాటలతో స్టార్ హీరోలను టార్గెట్ చేసుకొని అందరిత చివాట్లు తిన్న బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ మరోసారి తన నోరు పారేసుకున్నారు.  గతంలో పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ బాలీవుడ్ లో హిట్ అయితే బట్టలిప్పుకొని తిరుగుతానని అన్నారు. 


తర్వాత  బాహుబలి రిలీజ్ తరువాత అంతా బాహుబలి మేనియాతో ఊగిపోతున్న తరుణంలో మనోడు మాత్రం బాహుబలి చిన్న పిల్లలు చూసే కార్టూన్ మూవీలా ఉందని తీవ్ర విమర్శలు చేసాడు.  సాధారణంగా  కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్     సినిమాల విషయంలో.. హీరో, దర్శకులు, హీరోయిన్ల ఇలా  ప్రముఖుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు. 


దాంతో అతనితో ఇబ్బందులు ఎదురువుతున్నాయని సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసారు. అయినా కూడా అప్పుడప్పుడు సెలబ్రెటీలపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. తాజాగా ప్రభాస్ మూవీపై విమర్శలు చేసాడు. 


ఈ మూవీ కచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అన్నారు. ఈ మూవీ టి-సిరీస్ చరిత్రలోనే ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఎందుకంటే దాని బడ్జెట్ 250 కోట్లు అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. గతంలో అని పరిస్థితి తెలిసిన ప్రబాస్ ఫ్యాన్స్ అతని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  

Film #Saaho will be releasing on 15th August 2019. And it will be one of the biggest disasters of #TSeries! Because the budget is 250Cr! pic.twitter.com/8o6nJtE5F3

— KRK (@kamaalrkhan) May 21, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: