ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన రాజ్ తరుణ్ డ్రీమ్ గర్ల్ !

Seetha Sailaja
ప్రస్తుతం వరస పరాజయాలతో తీవ్ర నిరాశలో కొనసాగుతున్న రాజ్ తరుణ్ తనకు కలిసి వచ్చే లక్ ను వెతుక్కుంటూ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే రాజ్ తరుణ్ పెళ్ళి కొడుకుగా మారబోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా రాజ్ తరుణ్ ఈవిషయాన్ని మీడియాకు షేర్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ న్యూస్ గా మారింది. 

అయితే తాను పెళ్ళి చేసుకునే అమ్మాయి వివరాల విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నాడు. కానీ తమ ఇద్దరి కుటుంబాల మధ్య అంగీకారం కుదరడమే కాకుండా మాటలు కూడ అయిపోయాయి అని అంటున్నాడు. గత కొంత కాలంగా రాజ్ తరుణ్ ఇండస్ట్రీలోని ఒక యంగ్ హీరోయిన్ తో సన్నిహితంగా కొనసాగిన నేపధ్యంలో రాజ్ తరుణ్ చేసుకోబోయే అమ్మాయి ఆ యంగ్ హీరోయిన్ అవుతుందా లేదా బయట అమ్మాయి అని అనుకోవాలా అంటూ అప్పుడే ఆలోచనలు మొదలైపోయాయి. 

ప్రస్తుతానికి రాజ్ తరుణ్ చేతిలో ఒకేఒక్క సినిమా ఉంది అది కూడ ఇంకా ప్రారంభం కాలేదు. దిల్ రాజ్ నిర్మాణంలో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండేతో కలిసి ఇతడు చేయవలసిన సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. దిల్ రాజ్ నిర్మించే ఈసినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. 

గతంలో వరస హిట్లతో దూసుకు పోయిన రాజ్ తరుణ్ సినిమాలకు ఇప్పుడు బయ్యర్లు కూడ దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ హీరో తీసుకున్న ఈ నిర్ణయంలో రాజ్ తరుణ్ భార్య ఎవరు అన్న విషయం తేలడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాసం ఉంది. జంతువులను ముఖ్యంగా కుక్కలను విపరీతంగా ఇష్టపడే రాజ్ తరుణ్ కు ఇప్పుడు లైఫ్ పార్టనర్ దొరకడంతో ఈయంగ్ హీరో ఇంటిలోని మూగ జీవాలు కూడ బాగా ఆనంద పడతాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: