ఏపిలో వైఎస్ జగన్ విజయం సాధించిన విషయం తెలియగానే యాత్ర-2 ఎనౌన్స్ చేశాడు మహి వి రాఘవ్. వైఎస్సార్ బయోపిక్ గా మళయాళ స్టార్ మమ్ముట్టితో యాత్ర సినిమా తీసిన మహి వి రాఘవ్ వైఎస్ జగన్ గెలిచిన టైంలో తాను చెప్పాలనుకున్న కథ మీరు చెప్పారంటూ యాత్ర-2 ని ఎనౌన్స్ చేశారు.
అనుకున్నట్టుగానే యాత్ర-2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారట కూడా. వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు లేకుండా యాత్ర సినిమా అసంతృప్తిగా అయ్యిందని.. అందుకే యాత్ర-2 చేస్తున్నానని అన్నారు మహి వి రాఘవ్. ఇక ఈ సినిమాను వైఎస్సార్ సమాధి నుండి మొదలు పెడుతున్నట్టుగా చెప్పారు.
Thanks a lot @ysjagan Anna for the inviting me to your biggest day. Grateful and honoured by your kind gesture. I will be witnessing history and HIS’story tomorrow as he says “Jagan ane nenu” which most likely will be the last shot of #yatra2 #jagan @YSRCParty #APCMYSJagan— Mahi Vraghav (@MahiVraghav) May 29, 2019
రేపు జరుగనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మహి వి రాఘవ్ కు ఆహ్వానం అందిందట. జగన్ గారిది ఎంత గొప్ప మనసు అంటూ ఇక ఓ చరిత్రకు తాను సాక్ష్యంగా ఉండబోతున్నానని.. జగన్ అనే నేను అనేది యాత్ర-2లో లాస్ట్ షాట్ అని ట్వీట్ చేశాడు మహి వి రాఘవ్. ఈ ఎనౌన్స్ మెంట్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
యాత్ర సక్సెస్ కాగా యాత్ర-2 కూడా సూపర్ సక్సెస్ అవడం గ్యారెంటీ అంటున్నారు. వైఎస్ జగన్ పాత్రలో సూర్య నటిస్తాడని అంటున్నారు. యాత్ర 2లో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.. యాత్ర 2 ఇది వైఎస్ జగన్ జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు. మరి చరిత్ర సృష్టిస్తా అని చెబుతున్న మహి యాత్ర 2 ఏవిధంగా తీస్తాడో చూడాలి.