గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ ఎన్నికలలో పవన్ ఘోర పరాభవం తరువాత షేర్ చేసిన కవిత పై ఇప్పడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ కవిత రేణు దేశాయ్ ఎవరిని ఉద్దేశించి రాసింది అనే విషయం కూడ సస్పెన్స్ గా మారింది.
రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితమే రెండవ పెళ్లి కోసం నిశ్చితార్థం కూడా చేసుకుంది. పెళ్లి కూడా త్వరలో జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక కవిత పవన్ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈకవితను రేణు దేశాయ్ తన గతాన్ని గుర్తు చేసుకుని రాసిందని కొందరు అభిప్రాయ పడుతుంటే మరి కొందరు పవన్ పై ఉన్న ప్రేమతో రాసిందని కామెంట్స్ చేస్తున్నారు.
‘ప్రేమను మళ్లీ నేర్చుకోవడం సాద్యమేనా ? మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా ? ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థం అవుతుంది. నిద్ర లేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుందంటూ’ తన కవితలో పేర్కొంది. ఇప్పుడు రేణు ఈ కవిత ఇంత భావయుక్తంగా రాయడం వెనుక పవన్ ఓటమితో ఆమె పడిన బాధ అనుకోవాలా లేదంటే ఆమె రెండవ పెళ్ళి విషయమై ఏమైనా అనుకోని సమస్యలు వచ్చాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి..