సమంత అక్కినేని బ్యాక్ టు బ్యాక్ సినిమలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు కంప్లీట్ చేయడమే కాదు ఆ సినిమాలు కూడా గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. రీసెంట్గా తన భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'ఓ బేబీ' తో మన ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఒక టాప్ హీరో కూడా ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు కానీ సమంత మాత్రం సంవత్సరానికి 3-4 సినిమాలతో సందడి చేస్తూనే ఉంది.
సమంత అక్కినేని, సీనియర్ నటి లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ సినిమా ఓ బేబీ. బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రీసెంట్గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. కోరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆర్టిస్టులతో పాటు ఫీమేల్ టెక్నీషియన్ వర్క్ చేయడం ఎక్కువగా పనిచేయడం విశేషం.
ఇక ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడర్‌గా ఈ సినిమా రూపొందించినట్టుగా దర్శక నిర్మాతలు వెల్లడించారు. కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాలను ఆలోచింప చేసే కోణంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ 2 షేడ్స్ లో ఉంటుందని, ఈ రెండు క్యారెక్టర్స్ లో సమంత ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేయబోతోందని టాక్.