తెలుగమ్మాయి అయిన తమిళమ్మాయి అయినా హీరోయిన్ అన్నాక అన్నీ రకాల పాత్రలు పోషించాలి. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఠఫ్ కాంపిటీషన్లో ప్రతీ సినిమాకి తమను తాము నిరూపించుకుంటూనే ఉండాలి. ఇక మన దగ్గర తెలుగమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరని ఒక పెద్ద అపవాదు ఉంది. ఇందులో ఎవరికుండే కారణాలు వాళ్ళకున్నాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మనదగ్గర తెలుగమ్మాయిలకి అవకాశాలు మన దర్శక నిర్మాతలు ఇస్తున్న మాట మాత్రం వాస్తవం.
అంతేకాదు తెలుగమ్మాయిలు సైలెంట్ గా ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆ రకంగానే రంగస్థలం ఫేం పూజిత పొన్నాడ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటు కెరియర్లో దూసుకుపోతోంది. లఘు చిత్రాలతో మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 7లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది.
నేను తెలుగమ్మాయినే. కాలేజ్ చెన్నయ్ లో చదివాను కాబట్టి తెలుగులానే తమిళం మాట్లాడతాను. ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరియర్ ప్రారంభించాను. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్..తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్...ఇప్పుడు హీరోయిన్ గా కంటిన్యూస్‌గా అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగమ్మాయి అయినంత మాత్రాన బోలెడన్ని లిమిటేషన్ ఉంటాయనుకోకండి...కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్ అయినా చేస్తా అంటు ఇన్నోసెంట్‌గా ఆన్సర్ ఇస్తోంది.