వయసు ఎంతన్నది కాదు తమ ఫ్యాన్స్ ను అలరించేలా అందాల ప్రదర్శన చేశామా లేదా అన్నదే బాలీవుడ్ భామల పని అని చెప్పొచ్చు. వారిలో ఫార్టీ ప్లస్ బ్యూటీల హవా ఇంకా ఎక్కువ ఉంది. సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా వన్నె తగ్గని అందాలతో ఆడియెన్స్ పై మత్తు మందు చల్లుతున్నారు ముద్దుగుమ్మలు.
బాలీవుడ్ లో 40 ప్లస్ లో అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పని భామలు మలైకా అరోరా, శిల్పా శెట్టి, మందిరా బేడి. ఈ లిస్ట్ లో అమీషా పటేల్ కూడా ఉంది. హృతిక్ రోషన్ కహో న ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అమీషా పటేల్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. అక్కడే కాదు తెలుగులో బద్రి సినిమాలో నటించింది.
ఈమధ్య సినిమా అవకాశాలేవి రాకపోవడంతో తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది అమీషా పటేల్. లేటెస్ట్ గా మరో హాట్ పిక్స్ తో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలు గుమ్మరిస్తూ అమీషా చేసిన ఈ ఫీట్ బాగానే వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఇలా ఫోటో షేర్ చేసిందో లేదో అలా లైకులు, షేర్లు కొట్టేస్తున్నారు.
సినిమాల్లో అవకాశాలు రాకున్నా అమీషా పటేల్ కు ఇప్పటికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో మూడు సినిమాలు చేసిన ఈ అమ్మడు మళ్లీ తెలుగు ఛాన్సుల కోసం కూడా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం మళ్లీ అమ్మడికి మంచి రోజులు వచ్చినట్టే లెక్క.