సల్మాన్ ఖాన్ తో ఉపాసన రాంచరణ్ 'బిపాజిటివ్' అంటున్నారు!

మెగా డాటర్-ఇన్-లా, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన కామినేని. సినిమాలు తప్ప మిగితా విషయాల్లో మహా యాక్టీవ్. బేసిక్ గా ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడం తో సినీ ఇండస్ట్రీ దిశగా చూడకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో యాక్టీవ్ గా ఉంటూ చిరంజీవి కోడలిగా గౌరవం అభిమానం పొందుతున్నారు. 
ముఖ్యంగా “ఫుడ్ అండ్ హెల్త్‌” కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా పాఠక జనావళి కు పంచుతూనే ఉన్నారు ఉపాసన. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ - హేల్త్ & లైఫ్ స్టైల్ మ్యాగజైన్‌ ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూ లను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది ఉపాసన.


అయితే ప్రజల నుంచి ఈ మ్యాగజైన్‌ కి వస్తున్న ఆదరణ చూసిన ఉపాసన, ఇక ఆ సెలెబ్రిటీల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో ప్రేక్షకుల ముందుంచాలని డిసైడ్ అయింది. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కండల వీరునికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు ఇండస్ట్రీ లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయినా ఈయన క్రేజ్ ఎంతమాత్రం తగ్గట్లేదు సరికదా!  రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్లు నింగి నంటుతుంది.



పోలీస్ కేసులు, కోర్టులు చుట్టూ తిరగడం, జైలుకెళ్లడం - ఇలా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నిలబడి బాలీవుడ్‌ లో అగ్రహీరోగా కొనసాగుగ్తునే ఉన్నారు సల్మాన్. వరస హిట్లతో దూసుకు పోతూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం "భారత్" హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. 

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, సల్మాన్ ఖాన్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి "బిపాజిటివ్" అనే హెల్త్ మ్యాగజైన్‌ ను ఉపాసన నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ ద్వారా పాఠకుల్లో స్ఫూర్తి నింపడానికి సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్నారు. వారి ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్, హెల్త్‌-కేర్ గురించి అడిగి తెలుసుకుని ఆ విషయాలను పాఠకులతో పంచుకుంటున్నారు.  అలాగే ఇంటర్వ్యూ వీడియోలను "బిపాజిటివ్ విత్ ఉపాసన" పేరిట తన యూట్యూబ్ ఛానెల్‌ లో అప్‌డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సల్మాన్ ఖాన్‌ను ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సల్మాన్‌ తో ఇంటర్వ్యూ సమయంలో తీసిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. 

"ఇదీ భాయ్ అంటే. మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. సల్మాన్ భాయ్‌ లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం" అని ఉపాసన తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. వాస్తవానికి సల్మాన్‌ ఖాన్‌ తో రామ్ చరణ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. చరణ్ ముంబై వెళ్తే కచ్చితంగా సల్మాన్‌ ను కలుస్తుంటారు. అలాగే, సల్మాన్ హైదరాబాద్‌ వస్తే (షూటింగ్ నిమిత్తం వచ్చినా) చరణ్ వెళ్లి కలిసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ ను ఉపాసన ఇంటర్వ్యూ చేసి వారి మధ్య స్నేహబంధం ఎలాంటిదో మరోసారి నిరూపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: