టాలీవుడ్ హీరోయిన్ ప్రయాణిస్తున్న కారుపై కూలిన మెట్రో శ్లాబ్

టాలీవుడ్ సినిమా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరోయిన్  అర్చన కవి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి అదృష్ణవశాత్తు తప్పించుకుంది అర్చన. 

వివరాళ్లోకి వెళ్తే,  గత బుధవారం రోజున కొచ్చి ఎయిర్ పోర్ట్‌ కి కారు లో ప్రయాణిస్తున్న సమయంలో సిటీ మెట్రో శ్లాబ్ ఆమె కారు పై పడింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న పూర్తిగా ద్వంసం కావడంతో పాటు, కారు అద్దాలను బద్దలు కొట్టుకుని కాంక్రీటు పెళ్లలు కారు లోపలికి చొచ్చుకొని వచ్చాయి. 

ఆ సమయంలో కారులో ఉన్న హీరోయిన్‌ అర్చనకు పెను ప్రమాదమే తప్పింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ కారు డ్రైవర్‌కి నష్ట పరిహారం చెల్లించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరింది హీరోయిన్. 

We had a narrow (providential) escape. A concrete slab fell on our moving car while we were on the way to the airport. I would request @kochimetro and @KochiPolice to look into the matter and compensate the driver. Also see to it that such things don't happen in future. pic.twitter.com/knDdqC3bwN

— Archana Kavi (@archana_kavi) June 5, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: