రొమాన్స్ లో సమంతకు చుక్కలు చూపించిన నాగ శౌర్య..!

shami
అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న సమంత లేటెస్ట్ గా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో సమంత కు మేల్ లీడ్ గా నాగ శౌర్య నటించాడు.


ఇక ఈ సినిమా నుండి నాలో మైమరపు సాంగ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగ శౌర్యతో ఉన్న పోస్టర్ షేర్ చేసింది సమంత. అంతేకాదు నాగ శౌర్యతో రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పింది. పోస్టర్ గురించి చెబుతూ ఇది అంత సులభం కాలేదు. నాగ శౌర్యతో రొమాన్స్ సీన్లు చేయించడం కోసం ఎంత కష్టపడ్డామో తనకు, నందిని రెడ్డికే తెలుసని మెసేజ్ చేసింది.


ఇక ఈ మెసేజ్ కు రిప్లై గా నాలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టిన నిన్ను ప్రశంసిస్తున్నా అంటూ మెసేజ్ పెట్టాడు. మొత్తానికి ఓ బేబీ సినిమాపై ఈ స్పెషల్ చిట్ చాట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. జూలై 5న రిలీజ్ ఫిక్స్ చేసిన ఓ బేబీ సినిమాలో సమంత క్యారక్టర్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.


సురేష్ ప్రొడక్షన్, మధురా శ్రీధర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా ఫలితంపై సమంత పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా మన్మథుడు 2 లో కూడా నటించింది సమంత. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: