నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కబర్ల హంగామా మొదలైంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు పార్టులు నిరాశపరచాయి. అయితే కొద్దిపాటి గ్యాప్ తో బాలయ్య తన తర్వాత సినిమా ముహుర్తం పెట్టుకున్నాడు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు నిర్మాతగా సి.కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకు టైటిల్ గా రూలర్ అని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అయితే రూలర్ టైటిల్ కు నందమూరి ఫ్యాన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట అందుకే ఆ టైటిల్ మార్చి క్రాంతి అని టైటిల్ పరిశీలిస్తున్నారట. ఆల్రెడీ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో జై సిం హా సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నారు.
అయితే రాబోతున్న సినిమాకు క్రాంతి సినిమా వస్తుందట. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెహెర్ రమేష్ డైరక్షన్ లో కంత్రి సినిమా చేశాడు. బిల్లా తర్వాత మెహెర్ రమేష్ కు కాస్త కూస్తో పర్వాలేదు అనిపించిన సినిమా కంత్రి. అయితే ఇప్పుడు బాలకృష్ణ క్రాంతిగా రాబోతున్నాడు. ఎన్.టి.ఆర్ కంత్రి.. బాలకృష్ణ క్రాంతిగా వస్తున్నాడు.
ఈ సినిమాకు సంబందించిన కథ మార్చారని.. ముందు అనుకున్న కథ కాకుండా వేరే కథను సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.