ఎట్టకేలకు.. మెగాస్టార్ చిన్నల్లుడ్ని వేధించిన వాళ్లు దొరికారు !
ఇక తన మొదటి సినిమాలో నటన పరంగా మంచి ప్రతిభను కనబరిచిన కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రంగా దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ పూర్తి గడ్డం లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా కొన్ని విభాగాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాతోనైనా కళ్యాణ్ దేవ్ సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం. ఇక రాజేంద్ర ప్రసాద్, నరేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.