టీజర్ తోనే రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్..!
బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కి సాహో సినిమాపై కూడా ఆసక్తి పెట్టుకున్నారు సినిమా ప్రేమికులు. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన సాహో సినిమా టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే వ్యూస్ తో దూసుకుపోతూ ట్రెండింగ్ లో నిలిచింది. అతి తక్కువ టైమ్ లో 100కె లైక్స్ పొందిన టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రిలీజ్ అయిన మూడు గంటలలోపే 1మిలియన్ వ్యూస్ దాటి.. 6 గంటలలో డిజిటల్ వ్యూస్ మొత్తం కలుపుకొని ఇప్పటికే 25మిలియన్స్ కు పైగా వ్యూస్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రద్ధాకపూర్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించింది. విశేషమేమిటంటే తెలుగులో శ్రద్దా కపూర్ తన వాయిస్ కి తానే డబ్బింగ్ చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా మంది హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొఫెషనల్ ఫైటర్లు కూడా నటించినట్లు సినిమా టీజర్ బట్టి చూస్తే తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.