చిరంజీవి చిన్నల్లుడు కంప్లైంట్ ఇవ్వడం తో పది మందిని జైల్లో పెట్టిన పోలీసులు..!
ముఖ్యంగా ఫేక్ ఎకౌంటు తో కామెంట్లు పెడుతూ తనని మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పక్క ఆధారాలతో పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి ఐడీలతో పాటు అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ పది మందిపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
ఐదు రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వారి నుండి వివరాలు అందుకున్న వెంటనే నిందితులుగా గుర్తించిన పది మందిని అరెస్ట్ చేశారు. 'విజేత' సినిమాతో వెండితెరకు పరిచయమైన కళ్యాణ్ గారు ప్రస్తుతం పులి వాసు డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.