ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న అందాల భామ అర్చన...
హీరోయిన్ అర్చన విభిన్న చిత్రాల్లో హీరోయిన్గా, కీలక పాత్రధారిగా నటిస్తూ మెప్పిస్తూ వచ్చారు. తాజాగా ఈమె కీలక పాత్రలో నటించిన చిత్రం `వజ్ర కవచధర గోవింద` విడుదలైంది. ఈ చిత్రంలో నల్లూరి ప్రసన్న లక్ష్మి అనే ఎమ్మెల్యే పాత్రలో అర్చన గారు నటించారు. ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో అర్చన మాట్లాడుతూ...
"తెలుగులో పవర్ఫుల్ పాత్రలు మహిళలకు తక్కువగానే దక్కుతాయి. అలాంటి ఓ పాత్ర నాకు రావడం ఆనందంగా ఉంది. ఆ పాత్రలో లీనమై నటించాను. నా పాత్రకు చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి" అన్నారు అర్చన. అదే సమయంలో మీరు ఎమ్మెల్యేగా నటించారు కదా! మరి నిజంగా ఎమ్మెల్యేగా అవకాశం వస్తే చేస్తారా? అని అడిగిన విలేఖరి ప్రశ్నకు..
"ప్రశ్నిస్తే.. ఏమో చెప్పలేం.. కదా! అవకాశం వస్తే చేస్తానేమో? అంటూ సమాధానం చెప్పారు అర్చన. ఏదో ఫ్లో లో మాట్లాడింది అని మనం అనుకున్నా, మనసులో లేనిదే బయటకు రాదుకదా అనేది కొందరి మాటకారుల వాదన. ఏమో చూద్దాం మరి ఏ పుట్టలో ఏ పాముందో సమయం వస్తే గాని మనకు తెలియదు! ఐన పాలిటిక్స్ లోకి రావడం మన తెలుగు తరాలకు కొత్తేమి కాదు!
అలనాటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి నుండి, ఇప్పటి రోజా వరకు అడపా దడపా టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయాల్లో సత్తా చాటడం ఇరు తెలుగు ప్రజలందరికి తెలిసినదే. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న మాదిరి మన తెలుగు మిల్కి భామ అర్చన (వేద) రాజకీయాల్లోకి అడుగిడి, సత్తా చాటుతుందేమో మరి! చూడాలి....